పుట:Adhunikarajyanga025633mbp.pdf/128

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


డు, స్కాట్లాండు సాముదాయకరాజ్యాంగమందు సంపూర్తిగా చేరిపోయెను. అటులనే క్రీ. శ. 1800 సంవత్సరమందు పార్లమెంటుల శాసనములద్వారా ఐర్లాండు, ఇంగ్లాండు, స్కాట్లాండు సాముదాయక రాజ్యమందు ఐక్యతబొందెను. ఇదేవిధముగ, న్యూజిలాండునందలి వివిధరాజ్యములు, దేశముయొక్క ప్రధానరాజ్యమందు, తమశాసనములద్వారా, ఐక్యతబొంది, దేశమునకంత కొకే రాజ్యాంగమునేర్పరచుకొనెను. క్రొత్తగాయేర్పడిన ఐరిషుఫ్రీస్టేటుకూడ ఐర్లాండునందున్న 'అల్ట్సరు'రాజ్యమును జేర్చుకొనకయే తనంతతానే, ఒకరాజ్యాంగము నేర్పరచుకొన్నది. ఇటలీదేశ మందును, క్రీ. శ. 1848 సంవత్సరమునకు పూర్వము, ఎనిమిదిరాజ్యములుండెను. అవన్నియు క్రమముగా క్రీ. శ. 1870 సంవత్సరమునకు, సార్డీనియారాజ్యాంగమందు జేరిపోయి, ఆరాజ్యాంగమును ఇటలీదేశమునకంతకు వర్తించునట్లుచేసి, రోమునగరమును ముఖ్యపట్టణముగా నేర్పరచుకొనెను.

యుద్ధానంతరమేర్పడిన, జూగోస్లోవియా రాజ్యమునందు, సర్బులు, మ్రోటులు, స్లోవెనులు, అనుమూడు భాషలకు జెందిన, మూడుజాతులు కలరు. వారెల్లరు, తమ తమ భాషాప్రయుక్త రాజ్యాంగముల స్థాపించుకొనుటకుమారు, తమయిరుగుపొరుగు రాజ్యముల నిరంకుశతనుండి