పుట:Adhunikarajyanga025633mbp.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వలెనని ఆయాదేశముల రాజకీయనాయకు లనేకు లభిప్రాయపడుచున్నారు. కాని కార్మికనాయకులు, రాష్ట్రీయరాజ్యాంగముల స్వాతంత్ర్యమునే చాలవరకు బలపరచుచున్నారు. ఆస్ట్రేలియాయందు, న్యూఫౌండులాండు రాష్ట్రము, సమ్మేళన రాజ్యాంగము నెదిరించి, అపజయమందుటవలన, సమ్మేళనరాజ్యాంగమునకు బలముకల్గినది. అటులనే 1930 నుండి 1932 వరకు ఆర్థిక, రాజకీయసంక్షోభము జర్మీనీయందు కల్గుటయు, సమ్మేళనరాజ్యాంగమునకు బలముకల్గుటయు సభ్యరాష్ట్రములు బలహీనత బొందుటయు తటస్థించెను.

నిర్భంధమువలన, దండయాత్రవలన, ఒకరాజ్యము మరొకరాజ్యమందు లీనమై పోవుటచేకాక, రాజులబాంధవ్యములవలన,

ఐక్యరాజ్యాంగ స్థాపనము -
ఇంగ్లాండు, ఇటలీ, జుగోస్లావియా.

వివిధరాజ్యము, లైక్యత బొందుట వల్లను కాక, దేశశాంతికై, రాజ్యవిస్తీర్ణతకై, సాముదాయక శ్రేయోభివృద్ధికై, వివిధరాజ్యములు, కెనడా, దక్షిణాఫ్రికాలవలెనే, తమ "ఐక్యత"ను "స్వయంనిర్ణయాధికారము"ను వీడి 'పుచ్చుకొను' స్థితికి వచ్చి, ఏక రాజ్యనిర్మాణమందు జేరిపోవుట అపురూపమైన అనుభవముకాదు. అప్పటివరకు స్వతంత్రరాజ్యమైన, స్కాట్లాండు, తనరాజు శ్రీ ప్రధమజేమ్సుగారు, ఇంగ్లాండురాజ్యమునకు వారసులై నప్పుడు, తనశాసన సభయొక్క శాసనముద్వారానే క్రీ. శ. 1603 లో ఇంగ్లాం