పుట:Adhunikarajyanga025633mbp.pdf/126

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శాసనములు, కేంద్రశాసనసభల శాసనములకు విరుద్ధమైనచో, రాష్ట్రీయశాసనములు వీగిపోవుటకు మారు, సమ్మేళనశాసనముల ధిక్కరించి, సుప్రీముకోర్టువారి ముందు, తమరిద్దరిలో ఎవ్వరి రాజ్యాంగవిధానము చట్టసమ్మతముగ నుండెనో తీర్పుకై వేచియుండును. అనేక మారులు, కేంద్రశాసనసభవారి శాసనములే వీగిపోవుట తటస్థించుచుండును.

కెనడాయందుమాత్రము రాష్ట్రీయప్రభుత్వములకు రాజ్యాంగవిధానపు చట్టముద్వారా యొసంగబడిన యధికారములకు వ్యతిరేకమగు శాసనములను, కేంద్రప్రభుత్వము నిర్మించరాదు. అటులనిర్మింపబడిన శాసనములు, ప్రీవీకౌన్సిలువారిచే చట్టవిరుద్ధములని తీర్మానింపబడును. జర్మనీసమ్మేళన రాజ్యాంగమందు కెనడా సమ్మేళనరాజ్యాంగముకంటె హెచ్చు అధికారము సమ్మేళన రాజ్యాంగమున కివ్వబడుచున్నది. అచ్చట, సమ్మేళనరాజ్యాంగపు శాసనమునకు విరుద్ధమగు ప్రతిరాష్ట్రీయరాజ్యాంగశాసనము రద్దు అగునని, చట్టమే నిరూపించుచున్నది. కనుక సమ్మేలనరాజ్యాంగపు శాసనమునకు, రాష్ట్రీయరాజ్యాంగపు శాసనమునకు పోటీకల్గుచో, జర్మనీయందెల్లప్పుడు సమ్మేళనరాజ్యాంగపు శాసనమే నెగ్గుచుండును.

ఆస్ట్రేలియాయందును, జర్మనీయందును, ఇప్పటికంటెను హెచ్చుగా, సమ్మేళనరాజ్యాంగములు బలిష్టతజెంద