పుట:Adhunikarajyanga025633mbp.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యరాజ్యంగములుండ, కెనడా, దక్షిణాఫ్రికాలందు, ఆవి "పుచ్చుకొను" స్థితియందున్నవి. ఇందులకు కారణము, అమెరికా. ఆస్ట్రేలియాదేశములందలి రాష్ట్రములు సమ్మేళనమందు చేరుట కంతగా యిష్టపడకుండుటయు, కేంద్రప్రభుత్వమందైక్య మొందుట కభ్యంతరపెట్టుటయు ---- యుండెను. దక్షిణాఫ్రికా, కెనడాలయందు, రాష్ట్రములకు కేంద్రప్రభుత్వమందైక్యత బొందక తప్పినది కాదు.

కనుకనే మనదేశమందిప్పు డెట్లో, అటులనే, కెనడా, దక్షిణాఫ్రికాల యందలి రాష్ట్రీయశాసనసభలు, తమ బిల్లులన్నియు, కేంద్రప్రభుత్వచే నంగీకరింపబడిన పిమ్మటనే, చర్చింపబూనుకొనుటయు, తిరిగి ఆబిల్లులశాసనములుగా ప్రకటించక పూర్వము , దానిని, గవర్నరుజనరలు అంగీకరించవలసి యుండుటయు ఆచారమైయున్నది. తన్మూలమున కేంద్రశాసన సభవారి శాసనములకు విరుద్ధమగు నేశాసనమును, రాష్ట్రీయశాసనసభవారు నిర్మించుటకు వీలులేకున్నది. అమెరికాయందు, ఆస్ట్రేలియాయం దట్లుకాక, ప్రతిరాష్ట్రమును, సమ్మేళనరాజ్యాంగమున కొసంగబడిన యధికారముల మినహాయించి మిగిలిన రాజ్యాధికార పరిమితియందు తనకు తోచిన శాసనమును నిర్మించు యధికారము పొందియున్నది. ఆరాష్ట్రముయొక్క రాజ్యాధికారము సమ్మేళనరాజ్యాంగముపై ఆధారపడిలేదు. రాష్ట్రీయశాసనసభల