పుట:Adhunikarajyanga025633mbp.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇప్పటికి సమ్మేళనరాజ్యాంగమునకు, రాజ్యాధికారములేదని వాదించువారెవ్వరునులేరు. మానవజీవితము రాచకీయమందుకూడ వృద్ధిజెందవలయునన్న, సమ్మేళనసూత్రానుసారముగనే సాధ్యమగునని రాచకీయజ్ఞులు వాదించుచున్నారు. ప్రపంచమందలి వివిధరాజ్యాంగములు కూడికజెంది మానవకోటికి కళ్యాణము కలుగజేయవలెనన్న, సమ్మేళన రాజ్యాంగమువలననే సాధ్యమగునని అభిప్రాయపడుచున్నారు. కనుకనే అమెరికా వారిననుసరించి, దక్షిణాఫ్రికా ఖండమందలి కొన్ని రాజ్యాంగములు సమ్మేళనము చేర్చు కొనెను. కెనడా (1867) ఆస్ట్రేలియా (1900) దక్షిణాఫ్రికా (1909) దేశములందును సమ్మేళనరాజ్యాంగములు లేర్పరచబడెను. జర్మనీ, ఆస్ట్రియాదేశములందు యుద్ధానంతరము సమ్మేళన రాజ్యాంగములు స్థాపించబడెను. తుదకు నానాజాతి సమితి సమ్మేళనరాజ్యాంగసూత్రముల ననుసరించియే గుర్తించ బడినది.

ఇటులనే మనదేశమందును, బ్రిటిషుయిండియాలో నున్న రాష్ట్రములను, సమ్మేళనమందుజేర్చి, సమ్మేళనరాజ్యాంగమున

భారతీయస
మ్మేళనము.

కివ్వబడిన అధికారములుపోగా మిగిలిన రాజ్యాంగాధికారమును, రాష్ట్రముల కొసంగవలయునని, ముస్లిమునాయకులు వాధించుచున్నారు. అనగా మనరాష్ట్రీయప్రభుత్వములు, తమయధికార