పుట:Adhunikarajyanga025633mbp.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీలులేకుండుటను గురించి, పట్టుదలవహించి వాదించుచుండిన రాచకీయవేత్తలు, తమవాదము వృధాయైనదాయని నివ్వెరపడజొచ్చిరి. అంత, కొందరు రాచకీయశాస్త్రజ్ఞులు అమెరికా సంయుక్తరాష్ట్రసమ్మేళనము, రాజ్యాంగము కాదనియు, అందు రాజ్యాంగాధికారమెచ్చటను స్థిరతజెంది, ఐక్యతబొంది యుండలేదనియు వాదించమొదలిడిరి. వీరినాయకుడు శ్రీ జాను ఆస్టినుగారు రాజ్యాధికారము, అవిచ్ఛన్నమైనదనియు, అవిభక్తమైనదనియు, ఆమోదనీయమనియు నిరూపించి, అట్టిలక్షణములు అమెరికా రాజ్యాంగవిధానము నందెచ్చట కన్పించుట లేదని వాదించిరి. రాజ్యాంగాధికారము, ఆస్టినుగారు చెప్పినట్లు, ఐక్యతను, స్వయంనిర్ణ యతను బొందియుండుట, సాధారణపరిస్థితులందు అసాధ్యమనియు, అట్టి సంపూర్ణైక్యతబొంది, స్వయంనిర్ణయత్వము కల్గియుండు రాజ్యాంగాధికారము, ప్రపంచమునందలి ప్రజలందరియందును కూడ అంతర్గర్భితమైయున్నదని యీకాలపు రాచకీయజ్ఞులు వాదించుచున్నారు. శ్రీ సర్ హెన్రీమెయినుగారు, మనదేశపు పంచాయితీల వృత్తాంతము దృష్టాంతముగాగైకొని, శ్రీ ఆస్టినుగారివలె సంపూర్ణరాజ్యాధికారమును, వివిధరాచకీయ సంస్థలయందు గుర్తించ బ్రయత్నించుట పొరబాటనియు, సమ్మేళనరాజ్యాంగవిధానము, సహజమైన వృద్ధిలక్షణమనియు వాదించిరి.