పుట:Adhunikarajyanga025633mbp.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ర్ణముగా కలిసిపోవుట ఆకాలపు గ్రీకులకు సహజముగా కన్పడెనుకాని, సమ్మేళన మేర్పరచుట వారికిష్టములేక పోయెను. కావుననె అనేకమారులు వివిధ రాజ్యాంగములు తాత్కాలికావసరములబట్టి సమ్మేళనముల నేర్పరచుకొనుచుండినను, ఆసమ్మేళనములు శాశ్వతము కాజాలవాయెను. అటులనె రోమన్ ప్రజలు తమరాజ్యాధికారము హెచ్చగుకొలది తమ రాజ్యములో జేరుచుండిన వివిధదేశములయొక్క రాచకీయ వ్యక్తిత్వముల తగ్గించి వైచుచుండిరేకాని, సమ్మేళన రాజ్యాంగము నేర్పరుప బ్రయత్నించరైరి.

ఆధునిక కాలమందు ఇట్టి సమ్మేళన రాజ్యాంగములు, హాలాండునందును, స్విట్జర్లాండునందును (1648)

శ్రీఆస్టిను ప్ర
భృతుల వాదము.

యేర్పరుపబడెను. కాని, స్వాతంత్ర్యయుద్ధానంతరము, అమెరికాయందు సంయుక్తరాష్ట్రసమ్మేళన రాజ్యాంగము 1789 లో అమలునకు వచ్చినప్పుడు రాజనీతిజ్ఞులు ఆశ్చర్యమందిరి. ఆదేశమందు విశాలమగు భూభాగములకు సంబంధించిన, పదమూడు స్వతంత్రరాజ్యములు (ఐక్యరాజ్యములు) తమతమ ఐక్యతను పోనాడి, సమ్మేళనరాజ్యము నొక దానిని, తమపైనిర్మించుకొనుట అపూర్వమగు కార్యముగానుండెను. అప్పటివరకును రాజ్యముల ఐక్యతగురించి సంపూర్ణ స్వయం నిర్ణయతాధికారముగురించి, అవిభక్తత వినాశనము అన్యాక్రాంతముచేయ