పుట:Adhunikarajyanga025633mbp.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారమును కొంతవరకు నియమబద్ధము చేయవలెనని కొందరు రాచకీయజ్ఞులు వాదించుచున్నారు. కనుకనే రాజ్యాంగవిధానచట్టమునందు శాసనసభవారిపై కొన్నియంకుశములు నిర్ణయింపబడుచున్నవి. ఎప్పుడు శాసనసభ యేయంకుశమును అధికమించుచున్నదో నిర్ణయించు యధికారము, న్యాయమూర్తుల కివ్వబడుచున్నది. అప్పుడైనను, న్యాయమూర్తులు నిరంకుశముగా, శాసనసభవారి శాసనముల చట్టవిరుద్ధమని తీర్మానించకుండునట్లు చేయుటకై, నియమితమైన, మెజారిటీవలననే, న్యాయమూర్తులు, శాసనసభవారి శాసనములయొక్క సభ్యతగూర్చి తీర్మానించవలెనని రాచకీయజ్ఞులభిప్రాయపడుచున్నారు.



_________________