పుట:Adhunikarajyanga025633mbp.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిర్మించుచున్నారు. న్యాయమూర్తులపై, కార్యనిర్వాహకవర్గమువారు చాలా పెత్తనముచేయుచున్నారు. అందును, క్రిమినలు కోర్టులపై, కార్యనిర్వాహకవర్గమునకు అత్యధికమగు పైపెత్తనముకలదు. కార్యనిర్వాహకవర్గపుయుద్యోగులే క్రిమినలు కోర్టులందు మేజస్ట్రేటులుగానుండుటవలన ప్రజలకు, ప్రభుత్వముతో వివాదముకల్గినప్పుడు ప్రభుత్వముతరపుననే తీర్పులు సంపాదితమగుచున్నవి. మనకు వివిధప్రభుత్వాంగముల యొక్క స్వాతంత్ర్యసిద్ధి చాలయవసరముగానున్నది. అప్పుడే ప్రజలస్వాతంత్ర్యములు సురక్షితములగును. ప్రజలస్వాతంత్ర్యమును ప్రభుత్వము నిరోధించుచున్నచో న్యాయమూర్తులు ప్రభుత్వమును ప్రతిఘటించుచుండవలెను. న్యాయమూర్తులు తమకిష్టమున్నట్లు అనర్ధదాయకమగు భాష్యముల జెప్పుచున్నచో యాశాసనముల శాసనసభవారు సవరించవచ్చును. ప్రజలకు కంటకముగా నుండు ప్రభుత్వమును శాసనసభవారు పద భ్రష్టతనొందించవచ్చును. తుదకు శాసనసభయే, ప్రజలసహకారముతో, రాజ్యాంగమందు సంపూర్ణ రాజ్యాధికారమును, ప్రజలతరపున పొందియుండును. అప్పుడే భారతీయులకుగాని,తదితరులకుగాని, స్వతంత్రరక్షణ కల్గును. ఇట్టి సంపూర్ణాధికారము, శాసనసభల కొసంగుట యుచితముకాదనియు, మెజారిటీలు ప్రజలహింసించుటకై శాసనముల నిర్మించవచ్చుననియు, కనుక అట్టి శాసనసభయొక్క అధి