పుట:Adhunikarajyanga025633mbp.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సహకారము కడుంగడు అభిలషణీయము. కాని, ఒక్కొక్క అంగమునకు, ఒక్కొక్కవ్యవహారముపై సంపూర్ణాధికారముండుట మాత్రము లాభకరము. శాసనసభయొక్క శాసన నిర్మాణాధికారమునకు లోబడి, తదితర రెండు అంగములు, అవసరముబట్టి శాసనముల నిర్మించియు, మంత్రివర్గపు అధికారమునకు లోబడి, మిగతా రెండు అంగములు కార్యనిర్వాహకాధికారము చెలాయించుటయు, న్యాయమూర్తుల యాజ్ఞలకు లోనై కార్యనిర్వాహకవర్గమువారు అప్పుడప్పుడు న్యాయాన్యాయవిచారణచేయుటయుమాత్రము సాధ్యమగును. అట్లు పరస్పరముగా ఈమూడు ప్రభుత్వాంగములు ఇంగ్లాండునందు సంపూర్ణముగా సహకార మొనర్చుకొనుచున్నవి.పార్టీయొక్క మధ్యవర్తిత్వముద్వారా, కొంతవరకు అమెరికాయందు ఆసహకారము సాధ్యమగుచున్నది. బ్రిటిషువారి అధినివేశపుదేశములందు ఇంగ్లాండునందువలెనే సంతృప్తికరమగు పరిస్థితు లేర్పడినవి. జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీలందుమాత్రము న్యాయస్థానములు మంత్రివర్గపు ఆధిపత్యముక్రింద కొంతవరకు మూల్గుచున్నవని చెప్పకతప్పదు.

మనదేశమునందింకను ఈ మూడుప్రభుత్వాంగములు సంపూర్ణప్రత్యేక స్వాతంత్ర్యమును పొందనే లేదు. శాసనసభల

భారతదేశము.

నధిగమించి, గవర్నరు గవర్నరుజనరలుగారలు శాసన నిర్మాణాధికారము బొందియున్నారు. కార్యనిర్వాహకవర్గము వారు ఆర్డినెన్సులను తఱచుగా