పుట:Adhunikarajyanga025633mbp.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రధానసూత్రములమాత్రము జేర్చి శాసనములనిర్మించి, మిగతావివరముల జేర్చుటకు మంత్రివర్గమునకు హక్కునిచ్చుచున్నది. ఇందువలన అనేకవందలనియమములు ప్రతివత్సరము ప్రభుత్వము ప్రకటించుచున్నది. ఇవన్నియు శాసన సమానమగుచున్నవి. ఈపద్ధతిహెచ్చుగా ఫ్రా\న్సు, జర్మనీలయందు, ఇప్పుడిప్పుడు, ఇంగ్లాండునందు ప్రచారితమగుచున్నది. మరియు, కార్మికసాంఘికవిషయములందు మంత్రాంగవర్గము తనయుద్యోగస్థులను కొందరిని న్యాయమూర్తులుగా నియమించి, ఏయేకార్మికులకు నష్టపరిహారమివ్వవలెను, ఎవ్వరు నిరుద్యోగపోషణకర్హులు, ఎవ్వరికి ఆరోగ్యరక్షణ కల్గించవలెను, ఆదిగాగలవిషయముల తీర్మానించుచుండును. కాని, శాసనసభయాజ్ఞల ననుసరించియే మంత్రివర్గము అనుబంధశాసనముల జేయును. కనుక అట్టివి శాసనములకు విరుద్ధమని న్యాయస్థానములు తీర్మానించనగును. మంత్రివర్గము, న్యాయస్థానములు సక్రమముగా ప్రవర్తించునట్లు న్యాయమూర్తులు చూడవలసియున్నది. మంత్రాంగవర్గపు అనుమతిపైననే న్యాయమూర్తులు తమశాఖాపరిపాలనమొనర్చుచుందురు. న్యాయమూర్తుల శాసనానుబంధములు శాసనసభయొక్క యిష్టాయిష్టములపై నాధారపడియుండును.

కనుక, ఈప్రభుత్వపు మూడుఅంగములు పరస్పరముగా సహకారము చేసుకొనుచునేయున్నవి. అట్టి పరస్పర