పుట:Adhunikarajyanga025633mbp.pdf/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రభుత్వపు యీమూడుఅంగములు పరస్పరము సాధ్యమైనంతవరకు స్వాతంత్ర్యము బొందియుండవలెనన్నచో, ఒకకరికి

ఈమూడు అంగముల
మధ్య
వలయు సహకారము.

మరొకరితో నేలాటిసంబంధముండరాదని తలంపవలదు. ప్రజాస్వామికమేర్పరచబడిన దేశములందు స్విట్జర్లాండు, అమెరికాతప్ప, మిగతా అన్నిచోట్ల బాధ్యతాయుత ప్రభుత్వమే కలదు. అనగా మంత్రాంగవర్గము శాసనసభలో నొక్క కమిటీయైయుండి, ఆసభవారి యాజ్ఞాబద్ధమైయుండుచున్నది. అన్నిదేశములందును న్యాయమూర్తులు (అమెరికాసభ్య రాష్ట్రములందుతప్ప) కార్యనిర్వాహకవర్గము (ప్రభుత్వము) చే నియమింపబడుచున్నారు. న్యాయమూర్తులు ఎల్లయెడల శాసనసభవారి శాసనములను, కాలావసరముల ననుసరించి సాంఘికార్థిక, రాచకీయపరిస్థితులకు తగినట్లు తమవద్దకు విచారణార్థమై తేబడు వివాదములకు సంబంధించినంతవరకు అర్ధముజేసి చెప్పుచు, తమభాష్యములను తయారుచేయుచుందురు. ఆభాష్యములు న్యాయశాస్త్రమునందొక్క భాగమై, శాసనముల కనుబంధములగును. న్యాయమూర్తులు తమ శాఖయందు సక్రమవర్తనము ప్రచారితమగునట్లుజూచు కార్యనిర్వాహకాధికారముపొందియే యున్నారు. కార్యనిర్వాహకవర్గముకూడ ఈదినములందు కొంతశాసననిర్మాణాధికారము బొందుచున్నది. శాసనసభ అనేకవిషయములందు