పుట:Adhunikarajyanga025633mbp.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ర్తియు, ప్రభుత్వముపై నేవిధముగను ఆధారపడక, స్వతంత్రుడై యుండునట్లేర్పాటుచేయబడెనది. న్యాయమూర్తులం దెవ్వరైన ఘోరకృత్యములజేయుచో, వారిని శాసనసభవారు, తమతీర్మానముద్వారా నిందితులగా పరిగణించిననేకాని మంత్రివర్గము, వారినిపదభ్రష్టులచేయరాదు. ఈనియమములనే, తదితర బాధ్యతాయుత రాజ్యాంగములన్నియు అవలభించుచున్నవి. కనుకనే, పెత్తనమందున్న ప్రెసిడెంటుయొక్క చర్యలకు విరుద్ధముగా, అమెరికా సుప్రీముకోర్టుతీర్పు చెప్పగల్గుచున్నది. ఈమధ్య (1932 సంవత్సరమున) న్యూ ఫౌండులాండునందు, ప్రధానమంత్రి శ్రీ "లాంగు"చే నడుపబడిన ప్రభుత్వచర్యలు, అశాస్త్రీయములని, సుప్రీముకోర్టువారు తీర్పుచెప్పుటబట్టి, అతడు పదభ్రష్టుడైనాడు.

బ్రిటిషువారి అధినివేశపు రాజ్యాంగములన్నిటి యందును, న్యాయమూర్తులు, కార్యనిర్వాహకవర్గపు పెత్తనమున కతీతులై యున్నారు. జర్మనీయం దింతకుమించి మరికొన్నియధికారములు, న్యాయమూర్తులకొసంగబడుచున్నవి. వారిని సక్రమమగు కారణములపైననే, వారియనుమతిచొప్పుననే, ఒకచోటనుండి మరొకచోటకు బదలీచేయుటకు, ఆదేశమందు వీలుకలదు. అమెరికా రాష్ట్రప్రభుత్వములందు మాత్రము న్యాయమూర్తులు పురాతనపు ఏథెన్సునందువలెను, మన గ్రామపంచాయతీ లందువలెను, ప్రజలచే ఎన్నుకొనబడుచు