పుట:Adhunikarajyanga025633mbp.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పైనొకరు ఆధారపడకుండుటచే, అన్యోన్యసహకారము దుస్సాధ్యమగుచున్నది.

న్యాయాధిపతుల విషయమున కూడ, తదితర ప్రభుత్వాంగములనుండి, న్యాయాధిపత్యము విభేధించియుండుటే శ్రేయము.

న్యాయాధి
పతులు.

మంత్రాంగవర్గమువారి యిష్టముననుసరించి, కోర్టులు తీర్పులజెప్పునంత కాలము, ప్రజలకు స్వతంత్రము మృగ్యమగునుగదా? నిరంకుశరాజుల పాలనమందుకల్గుచుండిన యిబ్బందులు తిరిగికల్గును. కార్యనిర్వాహకవర్గముపైకాని, శాసనసభపై కాని ఆధారపడక, స్వతంత్రించి, తమకు న్యాయమనితోచినరీతి, ధర్మసూత్రములనేకాక, రాజ్యశాసనములకూడ విచారించి, తీర్పుల జెప్పుకోర్టులగత్యము. కనుకనే, శ్రీమాంటెస్క్యూ కాలము నుండియు, రాచకీయజ్ఞులెల్లరు, న్యాయమూర్తులు తమయధికారమునడపుటకు, తమయుద్యోగముల నిల్పుకొనుటకు, మంత్రాంగవర్గముపై ఆధారపడియుండరాదనియు, వారికి ప్రభుత్వమునుండి సంపూర్ణమగు స్వాతంత్ర్యము కలుగవలెననియు వాదించుచున్నారు. కనుకనే అమెరికాయందు, రాజ్యాంగ నిర్మాతలు, సుప్రీముకోర్టుయొక్క న్యాయమూర్తులు, జీవితాంతమువరకు, ఎవ్వరియాజ్ఞలకు లోనుగాక, సర్వస్వతంత్రులై అధికారము వహించుటకర్హులని నిర్ణయించిరి. అదేవిధముగ ఇంగ్లాందునందును, ఉద్యోగముబొందిన పిదప ప్రతిన్యాయమూ