పుట:Adhunikarajyanga025633mbp.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రభుత్వకార్య నిర్వహణమునకు వలయు శాసననిర్మాణమును నియమముల శాసించుటయు, ఎప్పటికప్పుడుచేయు పార్లమెంటుయుండుట కార్యనిర్వాహకవర్గమునకు లాభకరము కనుకనే అప్పటినుండి యేర్పడిన ప్రజాస్వామిక రాజ్యాంగములందు పార్లమెంటరీ బాధ్యతాయుతప్రభుత్వపద్ధతి యవలంబింపబడుచున్నది. అమెరికనుపద్ధతి నెవ్వరును అనుకరింపరైరి. అమెరికాయందిట్టి యవకాశములు సంపూర్ణముగా లేకుండుటచే అనేకయిబ్బందులు కల్గుచున్నవి. అప్పటికిని ప్రెసిడెంటుగారు తన సందేశములద్వారా కాంగ్రెసునకు శాసననిర్మాణము నందు దారిజూపెట్టుచున్నారు. మంత్రులు కాంగ్రెసుయొక్క కమిటీసమావేశములందు వివిధబిల్లులు చర్చకువచ్చునప్పుడు, తమయనుభవమును ధారవోయుచున్నారు.

పార్లమెంటుయొక్క ఆమోదము బడయునంతవరకే మంత్రాంగవర్గము అధికారమునందుండుటయు, సభలయొక్క అవిశ్వాసము ప్రకటితమైనంతనే రాజీనామా నిచ్చుటయు, ఇంగ్లండులోని "మెజారిటీ" పార్టీల ఆచారమైయున్నది. ఇందువలన, పార్లమెంటు మంత్రివర్గములమధ్య అన్యోన్యసహకారము సాధ్యమగుచున్నది. అమెరికాయందట్లుగాక, నాల్గువత్సరములవరకు, ప్రెసిడెంటు, స్థిరముగా అధికారమునందుండుటయు, అటులనే రెండువత్సరములవరకు అస్సెంబ్లీ సభ్యులు తమస్థానములందుండుటయు తటస్థించుచున్నందువలన, ఒకరి