పుట:Adhunikarajyanga025633mbp.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముల నిర్వహించునంతవరకు మంత్రాంగవర్గముతో పార్లమెంటు సహకారమొనర్పవచ్చును. అటులనే, తన పెత్తనము నడపుటకువలయు శాసనాధికారమును నిర్మించి, ధనాగారమును నింపుటకు పార్లమెంటు సంసిద్ధతజూపువరకు, కార్యనిర్వాహకవర్గము పార్లమెంటుతో సహకారముచేయవచ్చును. ఈరెండు అంగములు పరస్పరముగా సహకారము చేసుకొనుచున్నంత కాలము, కార్యనిర్వాహకవర్గము పార్లమెంటుయొక్క ఆజ్ఞలకు కట్టుపడువరకు, బాధ్యతాయుత ప్రభుత్వము సాధ్యమగుటయేగాక ప్రజలకు క్షేమమాపాదించును. అమెరికాయందుకూడ పార్టీలమధ్యవర్తిత్వముతో కార్యనిర్వాహక వర్గమునకును, కాంగ్రెసునకును, పరస్పరతోడ్పాటు, ఆధారముకల్గుచున్నది. ఇందువలన శాసనముల నిర్మించుటకు మంత్రివర్గమును, కార్యనిర్వహణమునకు పార్లమెంటును, ఇంగ్లాండులో పూనుకొనవచ్చునని తలంపరాదు. ఏసంస్థ కేధర్మములు ప్రత్యేకముగా విధింపబడినవో, వానినే నిర్వర్తించ వలయును. కాని, వానికిమించి అనేకవిషయములందు రాజ్యాంగసౌష్టతకై వివిధసంస్థలు సహకారమొనర్చుకొనుచుండుట మేలుకాదా ! శాసననిర్మాణము చేయుటలో పార్లమెంటునకు మంత్రాంగవర్గమువారు సూచనలిచ్చి, తోడ్పాటు కల్గించి, తమయనుభవమును ధారవోసి, తమ నాయకత్వమును ప్రసాదించుటవలన ఎంతోలాభముకలదు! అటులనే