పుట:Adhunikarajyanga025633mbp.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్నాడో, అటులనే, అమెరికా యందును ప్రెసిడెంటుయొక్క పార్టీకిచెందినవారు కాంగ్రెసుయొక్క రెండుసభలయందును కొలదిగనో గొప్పగనో యుందురు. ఈకాంగ్రెసుసభ్యులకు, ప్రెసిడెంటునకు, సహకారముకల్గుట సులభసాధ్యము కనుక కార్యనిర్వాహకవర్గము కాంగ్రెసుయొక్క సభలలో సభ్యులుకాకున్నను, వారిమాట కొంతవరకు నుపయోగపడును. వారి ప్రతిపాదనలను చాలవరకాసభలయందలి సోదరపక్షీయులు బలపరతురు. ఈవిధముగా, ఈరెండుప్రభుత్వాంగముల మధ్యను సహకారము సాధ్యపరుపబడుచున్నది.

కాని మొత్తముమీద చరిత్రయొక్క యనుభవము ఈమూడుప్రభుత్వాంగములు నొకే అధికారియందుగాని, ఒకే

శాసనసభయందే
మత్రాంగవర్గము ఒక
భాగముగానుండుట.

సంస్థయందుగాని కేంద్రీకరింపరాదని జూపెట్టుచున్నది. తిరిగి, అమెరికాదేశమందువలె బొత్తిగా నేమాత్రపు సహకారము లేకుందా, ఈప్రభుత్వాంగములు పరస్పరముగా ప్రత్యేకింపబడుటయు నష్టదాయకము. బాధ్యతాయుత ప్రభుత్వవిధానము నేర్పరుచుచో, మంత్రాంగవర్గము పార్లమెంటునకు బాధ్యత వహించి యుండునంతకాలము కార్యనిర్వాహకవర్గము, శాసనసభల పరస్పరసంబంధమును అవినాభావముగా కల్గియున్నను నష్టమేమియు లేదు. ఇంగ్లాండునందువలెనే పార్లమెంటుయొక్క అనుమతిపై ప్రభుత్వ కార్య