పుట:Adhunikarajyanga025633mbp.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ను, తనయిష్టమువచ్చినట్టేర్పరచి, తనయిచ్చవచ్చినట్లు మూడవజార్జిప్రభువు, మంత్రాంగ సభద్వారా, కామన్సుసభపై పెత్తనము జేయుచూ దేశమునుపాలించుచుండెను. ఆయనకు పార్లమెంటు యెందుకులొంగియుండెనో యదార్థము గ్రహించక, ఆయనమంత్రులు కామన్సుసభయందు సభ్యులైయుండుటవలనను, కార్యనిర్వాహకవర్గమునకు పార్లమెంటులొంగి యుండుట చేతను, ఆకాలపుదుస్థితి కల్గుచుండెనని వారుభ్రమజెందిరి. మరియు బాధ్యతాయుత రాచకీయసంస్థలద్వారా ఆప్రభువు తననిరంకుశాధికారమును సాగించుకొనుచుండెనని గ్రహింపరాయెను.

శ్రీమాంటెస్క్యూగారి గ్రంథపఠనముచే ఇంగ్లాండునందు, ఆకాలమునకింకనునిల్చియున్న వనుకొనబడు ప్రజా స్వాతంత్ర్యములు, స్వత్వములు, ప్రభుత్వాంగములు పరస్పరముగా ప్రత్యేకింపబడి యుండుటవలన వారు తలంచిరి. శ్రీమాంటెస్క్యూగారు వాదించినట్లు, ప్రజలస్వత్వములు, స్వాతంత్ర్యములు నిలబడవలయునన్న, అటుల వివిధప్రభుత్వాంగము పరస్పరముగా ప్రత్యేకింపబడవలయునని వారునునమ్మిరి.

కనుకనే అమెరికాసంయుక్త రాష్ట్రముయొక్క సమ్మేళన రాజ్యాంగమునందు, రాష్ట్రీయ రాజ్యాంగములందు, ఈత్రివిధ

అమెరికా రాజ్యాంగపు
విపరీతసౌధము.

ప్రభుత్వాంగములు పరస్పరముగా ప్రత్యేకింపబడునట్లుగా, రాజ్యాంగనిర్మాత లేర్పాటుచేసిరి. సమ్మేళనరాజ్యాంగపు తలమాణిక్యమగు ప్రెసిడెంటుగారుగాని, వారిమంత్రులు