పుట:Adhunikarajyanga025633mbp.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యించుచుండుటవలన, ప్రజలెల్లరు అస్వతంత్రులై యుండుటేకాక, నానాఅవస్థలకు లోనై, అనుదిన మొకగండముగా భావించుచు భయభ్రాంతులై యుండిరి. ఇంగ్లాండునకుగూడ రాజున్నను, ఈమూడుపెత్తనములు ప్రత్యేక ప్రత్యేకముగా జేయబడుచుండుటవలననే, అప్పటియింగ్లీషు ప్రజలస్వాతంత్ర్యత సిద్ధిబొందుచుండెవని వారునమ్మిరి. కనుకనే, ప్రజల స్వాతంత్ర్యత స్థిరపడవలయునన్న, ప్రజలు స్వతంత్రులై యుండవలెనన్న, ప్రభుత్వాంగములు పరస్పరముగా ప్రత్యేకించి యుండవలెను" (Separation of powers ) అనుసూత్రమును వారు నిర్వచించిరి.

దాదాపుగా ఆకాలమునందే అమెరికాదేశమునకు స్వాతంత్ర్యము సంపాదించ బ్రయత్నించుచుండిన శ్రీజార్జి వాషింగ్టను,

అమెరికా రాజ్యాంగ
నిర్మాతల భావములు..

మెడిసను, జానుఆడమ్సు, హామిల్టను వగైరాలు, తమ్ముహింసించి, తమదేశమును నిరంకుశముగా పాలనము జేయదలచుకొన్న శ్రీమూడవజార్జిప్రభుని ప్రభుత్వ పద్ధతులమాత్రమే, అట్లాంటికు మహాసముద్రమున కావలిప్రక్కనుండి విచారించి, పొరపాటభిప్రాయములబొందిరి. పార్లమెంటుయొక్క సభ్యుల లంచములవలన నేమి, బిరుదులు, తదితర రాజలాంఛనముల మూలముననేమి, తనకులోబరచుకొని అధికసంఖ్యాకులగు కామన్సు మెంబరులకు జెందిన మంత్రాంగవర్గము