పుట:Adhunikarajyanga025633mbp.pdf/101

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రణచేయు అధికారము కల్గెను. రాజు ఈమూడుసంస్థలతో సహకారము చేయుటకు అధికారముబొందియున్నాడు. ఈరహస్యమును, ఫ్రెంచివారి రాచకీయవేత్తయగు శ్రీ మాంటెన్క్యూగారు గ్రహింపక, తనకు గురుప్రాయుడును, ఇంగ్లీషు రాజ నీతిజ్ఞుడునగు శ్రీబ్లాకుస్పనుగారి ఆలోచనననుసరించి, ఈమూడుసంస్థలును పరిపూర్ణముగా ఒకదానినుండి మరొకటిభేదించి పరస్పర సంబంధము బొందక, పరస్పరసహకారమునకు తావివ్వకుండెనని తలంచెను. పార్లమెంటు, కార్యనిర్వాహకవర్గముపైకాని, కార్యనిర్వాహకవర్గము పార్లమెంటు న్యాయాధిపతులపైకాని, న్యాయాధిపతులు మిగతా రెండుసంస్థలపైకాని యేమాత్రము పెత్తనము పొందుట లేదని ఆయన భావించెను. ఇట్టి పరస్పర సంబంధములేక, ఏసంస్థ కాసంస్థ పరిపూర్ణతబొందియుండుటవలననే బ్రిటిషుప్రజలయొక్క స్వాతంత్ర్యజీవితము సాధ్యమగుచున్నదని ఆయన తీర్మానించుకొనెను.

శ్రీ మాంటెన్క్యూగా రిట్టి భ్రమ ప్రమాదము బొందుటకు కారణములు లేక పోలేదు. ఆయనకాలపు (1786) ప్రాంతపు

వారి భ్రమ ప్రమాద
మునకు కారణము.

ఫ్రెంచివారి పదునాల్గువ లూయీ చక్రవర్తి నిరంకుశ ప్రభువై శాసననిర్మాణాధికారమును, కార్య నిర్వాహణాధికారమును, న్యాయవిచారణాధికారమును తానే చెలా