పుట:Adhunikarajyanga025633mbp.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొకశాసనముప్రకారము తప్ప, నిర్భధింప బడరాదనియు, అట్లు నిర్బధింపబడినను, ఇరువదినాల్గుగంటలలోపల "హబీసు కార్పొసుఆక్టు" నమలు పరచమని యెవ్వరైన పిటీషనుబెట్టుచో, అట్లు నిర్బంధితుడైన పౌరుని మాజిస్ట్రేటు యెదుటకు తెచ్చి, అతడుచేసిన తప్పేమియో నిరూపించి, శాసనబద్ధముగామాత్రమే ఆతనిని ఆపిమ్మట నిర్బంధముగా నుంచవలయునను సూత్రము నిర్ణయింపబడెను. క్రమముగా ధర్మదేవతముందు ప్రజలెల్లరు, వారియందరి ఆర్థిక, సాంఘిక, రాచకీయ విభేదములతో నిమిత్తము లేకుండా సర్వసమానులే యను విశ్వాసమును ప్రజలుపొందుటచే ప్రభుత్వోద్యోగులు కూడ తాముచేయు అక్రమకార్యములకు తదితరులతోబాటు సమానముగా బాధ్యులగుట తటస్థించెను. ఇందువలన అశాస్త్రీయముగా, శాసనవిరుద్ధముగా ఏయుద్యోగియు సాధారణ పరిస్థితులం దేపౌరునైనను నిర్బంధించుటకు సాహసింపడు.

ఇటుల రాజునకు జెందియున్న మూడుపెత్తనములను ప్రజల యాధిపత్యముక్రిందకు తెచ్చి ఒక పెత్తనము మరొకపెత్తనముతో

శ్రీమాంటెన్క్యూగారు.

కుమ్మక్కియై ప్రజలస్వాతంత్ర్యమును మ్రింగివేయకుండ జేయబడెను. పార్లమెంటునకు మాత్రమే శాసన నిర్మాణాధికారము కల్గెను. మంత్రివర్గమునకే కార్యనిర్వాహకాధికారము సంప్రాప్తమయ్యెను. న్యాయాధిపతులకే న్యాయాన్యాయవిచా