Jump to content

పుట:Adhikari hitopadesam.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని నాయాత్మ చరిత్రంబును కులశీల నామంబుల వివరించుచు అనేక శతాబ్దంబుల యనంతరంబు నేటికి సంప్రాప్తించు నూతనాంద్ర రాష్ట్రావతరణ శుభసమారంభ సంరంభమున నవ్యాంధ్ర ప్రభుత్వంబునకు సమర్పించు కుతూహలంబున మిత్రులచే కోరంబడిన వాడనై యోచించి .

నాగరికతగానెంచి య
ధోగతి పాలగుచు వివిధ దుర్గుణ మతులై
త్యాగము శీలము విడచి య
నాగారకతనున్న యీ జనంబుల గనుచున్ ! 15

అవినీతియు దుశ్సీలము
నవలక్షణ కలితమైన యవనీప్రజపై
దవిలేడి భక్తిని నీతిని
వివరింపగ వ్రాసినాడ విబుధులు మెచ్చన్ ! 16

అధికారి నీతిదప్పక
విధినడచిన బ్రజకు శాంతి వృద్ధులు గలుగున్
అధికారి నీతిదప్పిన
బృధివియు సంక్షుభితమగుచు పీడింపబడున్ ! 17

అని నిశ్చయించి దేశ శ్రేయోభిలాషి నై

అధికారి నీతిశతకము
నధికంబగు భక్తీ దైవమాజ్ఞాపింపన్
బ్రధితముగ వ్రాసినాడను
బుధులార !యనుగ్రహించి బ్రోవుడు దీనిన్ ! 18