ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఛాత్రుడను సకల బుధులకు
పాత్రత నచ్యుతుదటండ్రు భవ్యులు నన్నున్ ! 9
అన్నలు మువ్వురు నాకును
జిన్నలు తమ్ముడును చిన్న చెల్లెండ్రును నా
కున్నారలిర్వు రేడ్వుర
మేన్నగ నున్నార మెలమి నిష్ట సుఖములన్ ! 10
అల విష్ణువర్ధన స గో
త్రులమై వడ్డూరి వంశ దుగ్దార్నవ ని
స్తుల పూర్ణ చంద్రులనగా
విలసిల్లితిమెల్ల భంగి విబుధులు మెచ్చన్ ! 11
పుడమిని వడ్డూర నియేడి
కడు దొడ్డ పురంబు గలదు కడిమిని దానన్
బోడముచు కీర్తి వెలుంగుట
నడ రెడు వడ్డూరి వారటందురు మమ్మున్ ! 12
మాతల్లి శేషమాంబకు
నేతల్లియు సాటిరాదు నెయ్యంబున వి
ఖ్యాతమగ నన్నదానము
సేతకు పతిభక్తి యందు శీలము చేతన్ ! 13
మాతండ్రి సోమరాట్కవి
పూతచరిత్రుండు సర్వ భూతహితుండున్
నీతియు నియమముగల వి
ఖ్యాతుడు నిరతంబు భగవదారాధకుడున్ ! 14