ఈ పుటను అచ్చుదిద్దలేదు
అధికారి హితోపదేశము
ఇష్టదేవతా ప్రార్థన
శ్రీ కరమగు భారతావని
నీ కరుణావీక్షణముల నిరతరవృద్ధిన్
సేకూరునట్లు జూడుము
నీకు బ్రణామములోనర్తు నిరతము దేవా ! 1
శ్రీ విఘ్నేశ్వర దేవా!
యేవిఘ్నము గల్గకుండ నీకృతి నీవే
గావుము మది నిన్నెప్పుడు
సేవింతును విఘ్ననాశ !శ్రీ గణనాధా ! 2
శ్రీ శారదాంబ ! యీకృతి
నె శబ్దార్ధముల దోషమెలమి గలుగాకే
ధీశక్తి గూడసేయవే
యాశాంత విశాలకీర్తి యలరగ తల్లీ ! 3
తల్లీ ! దండ్రి ! యోగురు
తల్లజ ! మీరెల్ల నన్ను దయజూచి కృతిన్
యెల్లజనులాదరింపగ
నెల్లపు డాశీర్వదిమ్పరే వినుతింతున్ ! 4