Jump to content

పుట:Adhikari hitopadesam.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కృతికర్త విజ్ఞప్తి

దేశమే యొక గృహము ... ప్రభుత్వము కుటుంబ యజమాని, అధికారులు గృహ నిర్వాహకులు, ప్రజలు బిడ్డలు.

ఇదివరలో మన ఇంటి పెత్తనం విదేశీయులు, పరాయి వారైన ఆంగ్లేయులు చేసియున్నారు. ధన, కనక రత్న రాసులతో, పాడి పంటలతో కలకల లాడే మన గృహం (దేశం) పరాయి పెత్తనం మూలంగా అయ్య వారి నట్టిల్లయినది. మన పెద్దలు జాతీయ నాయకులు అవిరళ ప్రయత్నములు చేయగా బాపూజీ నాయకత్వాన కాంగ్రెస్ ఆధ్వర్యమున మన ఇంటి పెత్తనం మనకు దఖలు పడినది. మన ఇంటికి (దేశానికి) మన ప్రజలే ఇప్పుడు బాధ్యత వహించియున్నారు. ఇక (దేశం) ఇల్లు అభివృద్ధి చేసుకొనవలసి యున్నది. గృహ నిర్వహణ విషయంలో ఇదివరకు విదేశీయుల పెత్తనంలో ఉండే పద్ధతులు మార్చుకొని ఆత్మాభిమానంతో ఆ ఇంటికి చెందిన వారందరూ (దేశప్రజలందరూ) బాధ్యతతో ప్రవర్తించాలి. ఇది సక్రమంగా నెరవేరుటలో గృహిణి ప్రధాన బాధ్యతతో తన విద్యుక్తధర్మాన్ని నిర్వర్తించే యెడల ఇటు బిడ్డలు, అటు యజమాని, గృహము అభివృద్ధి చెంది గౌరవ ప్రతిష్టలు పొందుట సాధ్యమగును.

మన భారత దేశమనే ఇంటికి ప్రజా ప్రభుత్వం ఇంటి యజమాని. అధికారులు తల్లి వంటివారు. ప్రజలు బిడ్డల వంటి వారు. అధికారులు నీతి పరులై తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వాశయములను సక్రమంగా అమలు జరుపుచూ ప్రజలను బిడ్డలవలె ఆదరించి సమ దృష్టితో వ్యవహరించిన దేశం అభ్యుదయాన్ని అందుకొని కీర్తి, గౌరవములు, శాంతి, సౌఖ్యములు పొందగలుగును. యీ విషయములు ఈ పుస్తకమున పొందుపరచబడినవి. అధికారులు దేశమందు రాజ్యాంగ యంత్రమున ప్రధాన పరికరము.