ఈ పుటను అచ్చుదిద్దలేదు
83 నీతిని దప్పక నడచుచు
జాతీయ విధానములను సరి నేర్పన్
ఖ్యాతిని గూర్పగా వేసనీ
కె తగు సుమ్మది యెరుంగుమిక నధికారీ
84 ఆరంభించిన కార్యము
పారంబును ముట్ట సేత పరమొత్తమమౌ
నారంభించి త్యజించిన
వీరులు ధర బరిహసింత్రు వినుమధికారీ !
85 ధర్మము నర్ధము కామము
కర్మము లీమూటి నీ జగంబు నవిబుధుల్!
నర్మిలి ద్రివర్గ మందురు
కర్మము ధర్మార్దమైన ఘనమధికారీ !
86 ధర్మమన వేడ నిగదిత
కర్మము గావించుటండ్రు ఘనులది గానన్
కర్మము ఫలమును గోరక
యర్మిలి సేయంగ ధర్మమగు నధికారీ !
87 ధర్మార్ధమైన యర్ధము
శార్మదమై సౌఖ్యమిచ్చు సకలార్ధములన్
నిర్మలత నొసగు గావున
ధర్మహితార్దార్జనంబు తగునధికారీ !
88 ధర్మార్ధ కామముల నిల
నిర్మలమతి నిర్వహింప నిఖిల శుభము లౌ