Jump to content

పుట:Adhikari hitopadesam.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

50 నిను గన్నతల్లి భారత
జననికి ద్రోహంబుసేయ జనదేన్న డిలన్
విను మీవు నీతి దప్పిన
జననికి ద్రోహంబె యౌ నిజంబధికారీ !

51 జనుడొకడు నీతిదప్పిన
వినుమాతనికే ఘటించు విపరీతంబుల్
గనగ నధికారి దప్పిన
ననయము బ్రజకెల్లహానియౌ నధికారీ !

52 వినుమేవ్వరేది సెప్పిన
ననుమానిమ్పకుము రిత్తయనుమానముతో
గనివిని నిజంబుదేలియక
జనులను దండింపదలప జనదదికారీ !

53 ధనమునకు దానధర్మము
లనుపమ భోగంబులే ఫలంబులు భువిలో
గననధికారమునకు ఫల
మనయంబు పరోపకారమగు నధికారీ !

54 వసుధను బరోపకారం
బసమానంబైన ధర్మమనిరి మహాత్ముల్
బొసగ బరహింస సేయుట
లసమానం బౌనధర్మమని రాదికారీ !

55 కలవారు లేనివారని
కలవిలలో రెండు తెగలు , కలికాలమునన్