ఈ పుటను అచ్చుదిద్దలేదు
బునుమించి గాన భారత
జననీ సంసేవసేయ జనునధికారీ
34 రాజరికంబున బ్రభువులు
యేజీతము నీకు నిర్ణయించిరో దానిన్
నీజీవితంబు నడపుచు
పోజెల్లు దురాశ జెందబోకథికారీ!
35 ఆజీతంబును దొరుకక
నీ జగమున నెంతమంది నిస్ప్రుహను జనం
బీ జీవితంబు రోయుచు
రోజుచు తపియించెనో యెరుగుమధికారీ!
36 ప్రాప్తించు దానివలననె
ద్రుప్తింబడీ నీవు నీ యధీన జనాళిన్
ఆప్తుందవగుచు బ్రోవుము
బ్రాప్తించును దాన సౌఖ్యపద మధికారీ!
37 శీలము కీర్తికి మూలము
శీలమె పరలోకసౌఖ్యసిద్ధికిమూలం
బాలంబమెల్లసుక్రుతికి
వాలాయము శీలముడుగవ దధికారీ!
38 నీతియె గుణగణరాజము
నీతియె బుధలోకమాననీయ గుణంబున్
నీతియె కీర్తికరంబిల
పూతమతీ! నీతి విడువబోకథికారీ!