ఈ పుటను అచ్చుదిద్దలేదు
28 నమ్ముటయుగాదు దెలియక
నమ్మకముండుతయుగాదు నయ మారయుచున్
నెమ్మది బరిశీలించుచు
నిమ్మహివర్తింపవలె జుమీ యధికారీ!
29 మాటయె సంధికి రంధికి
మాటయె ప్రేమంబు గూర్చి మరులుగొలుపగా
మాటయె వరములొసంగగ
మాటయె నరులకును మూట మహినధికారీ!
30 తొందరపాటును కూడదు
మందత్వము నుండరాదు మహి శీఘ్రగతిన్
పొందుగ కార్యము చందము
సందర్భము నెరిగిసేయ జను నధికారీ!
31 అలుకయు నర్ఢాపేక్శయు
కలనరమాతురత మరియు కామేచ్చయు దా
గలిగిన మనుజునకిలలో
గలుగదు శాంతియు సుఖంబు గనుమధికారీ!
32 ఆర్తుల గాపడుటయును
వర్తనము మంచిగలిగి వసుధార్కముగా
గీర్తిని సంపాదించుట
కర్తవ్యము నీకు తెలియగా నధికారీ!
33 జననియు జన్మస్ఠలమును
ఘనముసుమీ మనుజునకు జగంబున స్వర్గం