ఈ పుటను అచ్చుదిద్దలేదు
కందముల సరులబోలుచు
నందముగా గూర్చబడిన వర్దయుతంబుల్
మందుల కందని పదయుత
కందంబులు వీని బ్రేమ గైకొను మధిపా ! 24
చందన గంధా నిలమును
మందార మరందగంధ మాధుర్యంబున్
కందువ మరపించిన మా
కంద శతంబందు కొనుము కరుణను నధిపా ! 25
దేవా యవధరింపుము నీ యధికార వర్గంబునకు నా యోనరించు నట్టి హితోపదేశం బెట్టిదనిన .,