పుట:Abraham Lincoln (Telugu).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డును. కావున టేలరుభార్య యాబ్రహా మంతటియద్భుత బాలు నెన్నడు జూడ నైతి నని యతని గారవించుచుంట విపరీతముగాదు.

టెయిలరుగారి గృహమున నాబికి యునైటెడు రాష్ట్రపు జరిత్రయు మఱి రెండుపుస్తుకములును జే జిక్కెను. వాని జదువుటయం దతనికి మిక్కిలి యభిలాష యొడమెను. దినమంతయు గష్టపడి యొడలువంచి పనిసేసి రాత్రి నవ్వాని పఠించుచుండును. టెయిలరు గుమారుడు గ్రీను నిద్రాపరవశుడు. దీపము వెలుగున కోర్వక యాబీని నదలించుచుండును. మనసున గోపము నిండియుండియు బై బడి కొట్టునంత బలమున నొప్పియు శాంతస్వభావము గలవాడు గావున నాబ్రహాము గ్రీను నేమనక తనంతకు దా జదువుచుండెను.

అచ్చట నాబి సూకరవధ నేర్చుకొనియెను. టెయిలరీ పని కతని నియమించి నెల కిరువదిరూపాయిలవంతున సంపాదించుచుండెను.

ఓడనడపువాడుగ, వ్యవసాయదారుడుగ, గుఱ్ఱపువాడుగ, సేవకుడుగ, గడపట గటికవాడుగ నిట్లే పనిచేసినను సంపూర్ణముగ దనశక్తినెల్ల నుపయోగించి జయప్రదముగ దుదముట్టించుచుంట నాబ్రహాము యజమానుని నపరిమితానందమున ముంచెను.