పుట:Abraham Lincoln (Telugu).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రము సేయుచుండిరి.తన పడవనడుప మనుష్యు డొక్కని నియమించుకొన నభిలషించి థామసువద్ద కేతెంచి యాబ్రహాము నంపెదవా యని యడిగెను. ఇద్దఱును గొంతతడవు బేరము లాడుకొనినతరువాత టెయిల రాబ్రహామునకు భోజనమువెట్టి నెలకు రెండున్నఱరూపాయిలు జీత మియ్య నొప్పు కొనెను. థామసును అందులకు సమ్మతించి తన కొడుకును మఱుసటిదినము పనికి బంపెను.

యజమాను నాజ్ఞగొని యతడు నావికుడాయెను. సమయము పడిన చేనుకాపఱిగను, గుఱ్ఱపు మానిసిగను, ఇంట సేవకుడుగను కార్యములు నెరవేర్చవలె ననువిషయము గూడ నతని కెఱుకపఱపబడెను. ఓడ నడపుటాతనికి నవీనమగుట నెక్కుడు సంతసోత్సాహము లొసగెను. పదునేడు సంవత్సరముల బాలు డైనను ఆఱడుగుల నాలుగంగుళముల యెత్తై తదనుగుణముగ దళమై యాప్రాంతముల బలమున నెల్లర నతడు మించియుండెను.

టెయిలరుగారి యింటియం దతడు సర్వకార్యములను నెరవేర్చుచు వచ్చెను. తెల్లవాఱ నందఱికంటె ముందు నిదురలేచి ప్రొయి రాజ జేసి నీళ్లు సిద్ధపఱచి పచనకార్యమునకు వలయునదెల్ల నాయత్తము సేయుచుండును. చేసినపనియెల్ల మిక్కిలి జాగరూకతతో లోపముల కెడమీక ముగించుచుం