పుట:Abraham Lincoln (Telugu).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేయుచుందురు. గూఢతంత్రములచేతను గుప్తోచ్చారణల చేతను వ్యాధుల మాన్ప నుద్యమించు వైద్యు లనేకు లుందురు. ఏదో యొక పక్షి గవాక్షములోనికి దిగిన నాయింట మృత్యువు ప్రవేశించు నని జడియుచుందురు. బిడ్డకు గుఱ్ఱపు శ్వాసము దాకిన గుక్క దగ్గు ప్రారంభ మగునని తలంచుచుందురు. శుక్రవారముననే ముఖ్యకార్యమును జేయగూడదట. ఇక నిట్టి నమ్మికలు లెక్కకుమీరి యిప్పుడు మనల నెట్లో వారి నప్పు డటు బాధించుచుండెను.

పుట్టినదిమొదలు పెద్దవా డగువఱ కాబ్రహా మీలాటి జనుల మధ్య బెరుగుచు వచ్చెను. వారి యాచార్యవ్యవహారములును వారి యభ్యాసాభిప్రాయములు నెల్ల నతనికి జక్కగ మనసునకు వచ్చెను. అయిన నతడు వారి బాలుర గూడి మెలగుచుండుటను వారివద్ద పనులు సల్పుచు గాలము గడపుటవలనను వారితోడన సంభాషింపుచు, వారికష్టనష్టములన పరిగణించుటచేతను మఱి యేరివిషయములనైన నెఱింగి వానితో దనజనులయాచారాదుల సరిపోల్చుకొన జాలకుండెను. అయిన నతని మనస్థితికి దగు నున్నతాచారభిప్రాయము లెచ్చటను గానరాకుండెను.

టెయిలరు అనువాడు ఓహియో నదిమీదను ఆండర్‌సను అనువాడు క్రీకుమీదను నొకచిన్నపడవతో వ్యాపా