పుట:Abraham Lincoln (Telugu).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యనశాస్త్రము (chemistry) మొదలయినశాస్త్రములు దేశభాషలో నేర్పబడును. ఇంగ్లీషు ద్వితీయభాషగా నేర్పబడును. ప్రస్తుతము హిందూదేశ మందు రాష్ట్రీయశిక్షణము (National Education), రాష్ట్రీయవిశ్వవిద్యాలయము (National University) నుగుఱించి జరుగుచున్న ప్రయత్నములలో దేశభాషలలలో జనులకు జ్ఞాన మొసంగుట యొక ముఖ్యాంశమై యున్నది. కాని యిట్లు దేశభాషలయందు వివిధవిద్యల జనులకు బోధించుటకు బ్రారంభించుటకు బూర్వము నాభాషలలో నన్నివిషయములనుగుఱించిన గ్రంథముల నిర్మింపవలయును.

ఈయంశముల నాలోచించియే హిందూదేశములోని బంగాళము, మహారాష్ట్రము, హిందూస్థానము (యునైటెడ్ ప్రావిన్‌సెస్) మొదలగుదేశములలోని జనులు తమతమదేశభాషల యభివృద్ధికై పాటుపడుచున్నారు.

బంగాలీభాషయందు ఫ్రెంచి, యింగ్లీషు భాషలలోని యుత్తమ కల్పిత కథలను బోలిన కథలును, దేశచరిత్రంబులును (Histories), వ్యక్తిచరిత్రంబులును (Biographies), శాస్త్రీయ (Scientific) గ్రంథంబులును, విజ్ఞాన (Philosophical) గ్రంథంబులును, ఇంగ్లీషు పత్రికలబోలు నత్యుత్తమ మాసపత్రికలును, దేశాభిమానపూరితంబు లగు నాటకములును అనేకములు గలవు. ఇంతియ కాదు. వారుభాషాభివృద్ధి జేసిచేసి ప్రస్తుత మాభాషయందు నొక ప్రచండమైన విశ్వకోశమును (Encyclopaedia) గూడ నిర్మించియున్నారు. విశ్వకోశము నిర్మించుటకు భాష యెంత యభివృద్ధి జెంది యుండవలయునో పండితులకు వేఱుగ జెప్ప నక్కఱ లేదు.

బంగాలీభాషతో సమానముగా మనదేశములో నభివృద్ధి జెందుచున్న రెండవభాష మహారాష్ట్రము. మీ కేదేశచరిత్రము కావలసినను నీభాషయందు దొరకగలదు. ప్రకృతిశాస్త్రంబు లనేకములు వ్రాయబడినవి. ప్రఖ్యాతి గాంచిన యింగ్లీషు గ్రంథంబు లనేకము లీభాషయందు భాషాంత