పుట:Abraham Lincoln (Telugu).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యందు వ్యుత్పత్తిజ్ఞానము సంపాదించి పిదపగదా గణితము చదువుటకు బ్రారంభించవలెను. ఇంగ్లీషున నితరశాస్త్రముల నభ్యసింపవలయు ననినను మన మింత పరిశ్రమ చేయవలసి యున్నది. ఇంత ద్రావిడప్రాణాయామ మేల? ఎవరి మతృభాషలో వానికి జ్ఞానదానము చేయగూడదా? అటుల జేయక ప్రస్తుతము మనవారు శాస్త్రములన్నియు నింగ్లీషులో జదువుచున్నందున నెంతయో యెక్కుడు కాలమును, ఎక్కుడు పరిశ్రమయు, నెక్కుడు ధనమును వ్యయ మగుచున్న వని యనేకవిద్వాంసుల యభిప్రాయమై యున్నది. ప్రవేశపరీక్షకు బైపరీక్షలకు జదువు విద్యార్థులకు నిబ్బంది లేకపోయినను, బ్రవేశపరీక్షకు గ్రిందితరగతులలో జదువుపిల్లలు, భూగోళము (Geography), భూమితి (Geometry), పదార్థవిజ్ఞాన శాస్త్రము (Physics), రసాయనశాస్త్రము (Chemistry) మొదలయిన శాస్త్రముల నభ్యసించునపుడు నర్థము తెలియనందునను, లేక తెలిసిన దాని నింగ్లీషులో మరల చెప్ప జేతకానందునను బుస్తకముల గ్రుడ్డిపాఠముచేసి పరీక్షలలో గృతార్థు లగుట మనము చూచుచున్నాము. ఈ శాస్త్రములన్నియు వారివారి మాతృభాషలలో నేర్పినయెడల నాశాస్త్రముల జదువుటకు బ్రస్తుతము పడుచున్నంతశ్రమ పడ నక్కఱలేదు. ఇట్లు సమస్త విద్యలను దేశభాషలలో నేర్పి యొక యింగ్లీషుభాషమాత్రము ద్వితీయభాష (Second Language) గా బోధించినయెడల, బ్రస్తుతము ప్రవేశపరీక్షకు బోవు విద్యార్థులకు గల జ్ఞానమంతయు బ్రస్తుతము పట్టుచున్నకాలములో సగముకాలములోనే గడింపవచ్చునని మహారాష్ట్రీయులు సిద్ధాంతీకరించి యట్టిపాఠశాలల నేర్పఱచుచున్నారు. ఈ పాఠశాలలలో నిండియా, ఇంగ్లండ్, గ్రీస్, రోమ్ ఈ దేశముల చరిత్రములును, అంకగణితము (Arithmetic), బీజగణితము (Algebra), రేఖాగణితము (Geometry), ఈగణితములును, భూగోళము (Geography), పదార్థవిజ్ఞానము (Physics), రసా