పుట:Abraham Lincoln (Telugu).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె సుగుణపుంజంబు దన మనమున నివసించి యామెను సంపూర్ణముగ గోచరింప జేయుచుండెను.

ఉపన్యాసస్థితభావముల ననేకముల నతడు చక్కగ గ్రహించెను. తనంతట దా యోచించువాడు గాన నతని కిది యపూర్వము గాదు. కొన్ని సంవ్త్సరములకు దరువాత నిట్టి యుపన్యాసకుల యభిప్రాయముల ఖండించుచు వినువారల నానందింప జేయుచుండును. ఒకొక్కవేళ వారు చేసిన సిద్ధాంతముల బూర్వపక్షము సేయుచుండును. అతని బాల్యప్రౌఢిమ యీవిధమున బయలుపడుచుండెను. పై జెప్పిన నాంసీ జ్ఞాపకార్థకోపన్యాసము నందలి భావముల మాత్ర మతని మన:శిలపై జెరపరాని స్ఫుటాక్షరముల లిఖితము లయ్యెను.

భాల్యమున నాబి యిరుగుపొరుగువారి సంభాషణముల తఱచుగ శ్రద్ధతో వినును. జ్ఞానశూన్యు లగుగొందఱు మాటలాడునెడ వారి యర్థములేని పిచ్చిమాటలకు విసుగును. ఆతని తీక్ష్ణబుద్ధియొక్క విషయమున జ్ఞాన మలవడిన నట నిలుచునదిగాదు. ప్రతిసంగతియు గ్రహింప నిచ్ఛగలిగి చలించు చుండును. కావున నప్పుడప్పుడు జ్ఞానహీనుల ప్రగల్భములకు నతడు గోపించుకొనుటగూడం గలదు.

నూతన పుస్తకము అతనికి దొరకినచో వాని జదివి వానివిషయముల విమర్శించి తన యభిప్రాయముల నిరంకు