పుట:Abraham Lincoln (Telugu).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నకు మెండాయెను. తమ కుటుంబమున నేరును వ్రాయునంతటి ఘనకార్య మొనర్చి యుండలేదు. అతని కదియ వింతయై తోచెను.

తండ్రి వ్రాత నేర్పరితనపు బ్రయోజనముల బొగడుచుండెను. ఆబ్రహామున క వెల్ల గడుసామాన్యముగ దోచుచుండును. ఒకొకమారు దీనివిశేష మేమియును. మఱొండుతఱి నేనింతకంటె బాగుగ నేర్చెద ననిసంతసించు.

జాబు ముగిసినతోడనె యతనిదృష్టి వేరువిధమున బాఱ నారంభించెను. తా బంపిన కమ్మ పార్సన్‌గారి కెప్పుడందునో యత డెన్నడు విచ్చేయునో యెఱుగ గోరి తండ్రిని బ్రశ్నించెను. అతని కాలెక్కలు దెలియవు. ఉత్తరము వోయి చేరుననిమాత్రము వినియుండును. కావున 'నదంతయు నేనెఱుగ,జాపువోయి చేరును. చేరిన పార్సన్ రావచ్చు' ననియెను.

ఆయుత్తరము మెల్లమెల్లగ మార్గము వట్టెను. దాని ఫల మరయ నాబ్రహాము మనసు తొందర పడుచుండును. మొత్తముమీద నీకార్య మతని బాల్యమున నొకముఖ్యాంశ మనుటకు సందియము లేదు. అది పార్సన్‌కు జేరునా యనుశంక యతనివట్టుట స్వాభావికము. దాని వ్రాసినదిమొద లతనికి బ్రఖ్యాతిం దెచ్చి యితరుల మేలున కతని బురికొల్పె ననుటయు జిత్రముగాదు.