పుట:Abraham Lincoln (Telugu).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సేసెను. స్పారోల ప్రక్కన నొక గోరీ దీసి యద్దాన నాశవంబు నునిచిరి. ఆసీమయందలి 'మార్గదర్శక' కుటుంబము లెల్లయు నచటి కేతెంచి యార్తహృదయకమలములును నార్ద్రచక్షురుత్పలములను నామె కర్పించి దమప్రేమ సూపిరి.

నతి మరణానంతరము గొన్నిమాసములమీదట నొక సాయంకాలమునలింకను "ఆబి! పార్సన్ ఎల్కిన్సు (పురోహితుడు) గారికి నీ వొక యుత్తరము వ్రాయవలెను. నీ విప్పుడు చక్కగ వ్రాయ గలుగుదువుగదా" యనియెను. ఆబ్రహాము పదిసంవత్సరములు దాటి యుండెను.

"ఏమి వ్రాయవలయునో నొడివిన నే వ్రాసెద గాక" యని యాకుఱ్ఱడు ప్రత్యుత్తర మిచ్చెను.

తరువాత థామసు దనభార్య యారోగ్యము దప్పినది మొదలుగ బరమపద మందినవఱకు వ్రాయించి యాపార్సన్ దమ కుటీరమునకు విచ్చేసి యథావిధిగ నాంసీ జ్ఞాపకార్థ ముపన్యసించి పోవలసినదని వేడెను. ఆబ్రహాము దమ నూతన నివాసస్థలపు వర్ణనయు దా మట కేతెంచుటయు దమ యుత్తరాపేక్షలును ఆ పత్రమున లిఖించెను.

వ్రాసినజాబు కుమారుడు చదువుచుండ థామసు సంపూర్ణహృదయంబున వినుచుండెను. అంత పసివాడు దనపుత్రరత్న మింతకార్య మొనర్చువా డాయె నను మోద మాయ