పుట:Abraham Lincoln (Telugu).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కప్పుంబోలి మ్రాకుపలకలచే నిర్మిత మై యుండు. ఇల్లంతయు నొక్కగదియ. కప్పునకును గోడలకును మధ్య పలకలువేసి యొక వెలిసెగట్టుకొని యాభవనంబు జేరుట కొక గోడమూలన గన్నములు మేకులు నిలిపియుందురు. ఆగది కొక్క ద్వారంబును మఱొండు కిటికీయు గలవు. ఈ రెండవదానివిషయము గొంచము ముచ్చటించుట యుక్తము. థామసు కిటికీదట్టము నొకదాని నాలుగద్దపుబిళ్లల నుంచులాగున పన్నెను. పన్ని దానినిండుగ నొక సూకరపు క్రొవ్వుపై నుండు పొర గప్పివేసెను. పొరయద్దమునకు దగిన ప్రత్యామ్నాయవస్తువయ్యె."" ఇట్టియూహావిశేషంబు గనుపఱచిన వానిబుద్ధియే బుద్ధిగదా!

తే.గీ. దేవు డిచ్చినదానిచే దృప్తినొంది
     యాత డిచ్చిన ధీశక్తి నలరజేసి
     తనదు కొంచమ సంపద యనుచు బొంగి
     బ్రతుకు మనుజునిదేపొమ్ము బ్రతుకుధరను.

గృహనిర్మాణం బైనమీదట గృహోపకరణనిర్మాణంబు గావలసి యుండెను. తద్విషయమున దండ్రికుమాళ్ల కిట్లు సంభాషణ జరిగెను.

"ఆబి ఆ పోగరకొల్త త్రాడును నిటు తీసికొనిరమ్ము. పరుండ మంచమొక్కటి నిర్మిపవలయు."