పుట:Abraham Lincoln (Telugu).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దినములకు విచిత్రవిషయ మొండు జరిగెను. డేవిసను నొక తెల్లవాడు కార్యార్థి యై యిలు వెడలిపోయి యుండెను. అతని భార్యాపుత్రులుమాత్ర మట నుండిరి. దీనిం గాంచి యొక యిందియ నతనియిల్లు కొల్లగొట్టి యాలుబిడ్డల జెరగొనిపోవ నిశ్చయించుకొని తుపాకి చేతబూని డేవీసు గృహము సొచ్చెను. డేవిసుభార్య వాని జూచి గుండెనీరు విడువక మన స్థైర్యమున నా హతకుని నాతిథ్య మంగీకరింపు మనివేడుచు సారాయి సీసా నొకదానిదీసి బల్లపైనిడి వాని నద్దాని స్వీకరింపు మనిప్రార్థించెను. వా డట్లుచేయ నిచ్చగించి సీసానుండి సారాయి పోసికొను బ్రయత్నమున దన తుపాకి బల్లపయి నిడియె. అంత నా నారీమణి దాని చివుక్కున లాగుకొని వాని శిరంబునకు దానిమూతి నిడి 'నీవు నా కధీను డవు గాకున్న నీ యుసురుల నీ క్షణంబున దీసెద' నని వెఱపించెను. ఆ యిందియను దనచేత నున్న బుడ్డి దిగవిడచి "నను కాల్వకున్ననే నీకేమియు గీడు చేయ"నని పలికి కదల మెదల లేక కూర్చొని యుండెను. ఈతీరున వాని దన పెనిమిటి యిలుసేరువఱకు నా రమణీలలామ పట్టునబట్టి యుండెను!

అదేసమయమున నద్భుత తరం బగు సాహసప్రవర్తనంబు మరొండు రామాకులవతంసంబు గనుపఱచె. ఒకనాటి నిశీధమునం గొంద ఱిందియనులు ------------------