పుట:Abraham Lincoln (Telugu).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రయాణ ప్రయత్నములు త్వరితగతి నొనర్ప బడియెను. రెం డశ్వముల నద్దెకు దీసికొని వానిపై గృహోపకరణంబుల నెక్కించిరి. నాంసీ, ఆబ్రహాము, సారా కొంత దూరము నడచుచు నప్పుడప్పుడు గుఱ్ఱములపై నెక్కుచు బ్రయాణము సాగింప నారంభించిరి. ఈ విధి దరలి రాత్రులు తారాపథంబు కప్పుగ గొంగళులు హంసతూలికాతల్పంబులుగ గడపి యేడు దినంబులు దారినడచిరి.

వారి కదియెల్ల నూతనానుభవంబె. ఆయనుభవంబును ననే కాపాయకారణకలితంబు, అయిన వారికి భీతి లేశంబును గానరా దయ్యె. ఆ దేశమున నాదినముల నెట్టికష్టములు వచ్చినను స్త్రీపురుషు లందఱు జంకు కళంకు లేక ప్రవర్తించుచుందురు.

అప్పటి స్త్రీ లిప్పటివారివలె బెదరుపోతులు గారు. వారొక్కొకతఱి జూపిన ధైర్యసాహసంబులు మహాద్భుతములు. ఆపదశ్రేణులకు దల లొగ్గవలసి యుండుట వా రెట్టికష్టముల నైన దిట్టడితనంబున వహింపనేర్చి కీడు జంకించిన ధైర్యం బవలంబించి నష్టముల గణింపక రానురాను సుగుణపుంజంబుల కిక్క లగుచు దేవుడు దమకు నిర్ణయించిన కార్యము నెరవేర్చుచుందురు.

ఈవిషయము నుదాహరించుట కనేక చరిత్రాంశముల వ్రాయవచ్చును. ఆబ్రహాము తాత కెంటకసీమ చొచ్చిన కొద్ది