పుట:Abraham Lincoln (Telugu).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిత్తులు జలంబుల బొరల నారంభించె. థామసు సొమ్ముదక్కించుకొను సంభ్రమమున నాతెప్ప నొక్కిపట్టుట కెదురువైపునకు పరుగిడియె గాని సారాయిబరువుచే నాతెప్ప దలక్రిందులాయెను. తిత్తులతోగూడ దాను నీట మునుగవలసి వచ్చుట గాంచి యతడు బ్రయత్నించి యాతెప్ప పట్టు వదలక తన ప్రాణముల గాపాడుకొన సన్నద్ధుండాయెను. అప్పుడ "అధైర్యపడకు మధైర్యపడకుము. మే మిదె యొక్కనిమేషంబున వచ్చితి" మను శబ్దము విననాయెను. అందుల కానందం బంది థామసు దత్తరపాటున "శీఘ్రంబు నను రక్షింపుడే" యనీ కేక వైచెను. కొందఱు దను బై కెత్తుచుండ టతనికి విశదమాయెను. ప్రక్కన దమకార్యముల మెలంగుచుండిన యోడవారతనిపై జాలిగొని రక్షింప వచ్చియుండిరి. వా రతని దమపడవపై నెక్కించుకొని యతని సామగ్రి నెత్తియిచ్చుటకు బూనిరి. ఓహియోనదియం దిట్టి యుత్పాతము లాదినములలో బహుమెండు. తన్ని వారణానుకూలు లగుసహాయులు పెక్కండుందురు. వా రితరుల కష్టముల దీర్చుటకు గంకణము గట్టియుందురు. సోదరభావంబును నైకమత్యంబును నెల్లెడల గను పఱచిగాదే పశ్చిమదేశము లతివినుతి జెందినవి.

ఇట్లా థామసు రక్షింపబడి దనరక్షకు లెత్తి యియ్యగల్గిన సొమ్మును మరల దన తెప్పపై నెక్కించుకొని వారు