పుట:Abraham Lincoln (Telugu).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గెను బోధకుల పాండిత్య మెండగొలె గాబోలు. శిష్యుల గొంద ఱతనికంటె నెక్కు డక్షరజ్ఞు లయిరనిన నంత యనృతముగా నుండదు. అది యెట్లుండిన నేమి. అబి (అబ్రహాము) సారా రైనిగారి నుండి సెలవు పుచ్చుకొని మరొండు బడికి దఱలిరి.

అయ్యది హేజల్ అను నత డుంచినది. అతడు రైని కంటె పెక్కు మడుంగు లెక్కుడు నేర్చినవాడు. తన శిష్య బృందమునకు వాచక లేఖనములు రెండును సాధారణముగ నేర్ప సమర్థుడు. మొత్తముమీద నత డాబికి బ్రారంభదశయం దుచితవిధమున నుపదేశ మొసగ గలిగియుండెను. అయిన నతని పల్లెకూట మాబ్రాహా మింటికి నాలుగుమైళ్ల దూరము నుండెను. నాంసీ థామసు లీవిషయమును లెక్కకు గొన రైరి. ఎక్కువ వ్రయమునకు గూడ వెనుదీయ రైరి. తమ గడించినదాని నతిమితముగ నుపయోగించుకొని బిడ్డలకు విద్యాసంపత్తి లభించిన జాలు నని యనేక కష్టముల కోర్వనిశ్చయించిరి. నాటినుండి అబిసారాలి రిరువురును ప్రతిదినమును మధ్యాహ్న భోజనమునకు రొట్టెతునక మోసికొని నాలుగుమైళ్లు నడచి విద్యార్థు లై వెడల నారంభించిరి. అప్పుడ యాబ్రహాము విద్యా సంపత్తికి బ్రారంభము. అట నాతడు లేఖనము నభ్యసించెను. దాన నంత ప్రావీణ్య మల