పుట:Abraham Lincoln (Telugu).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ర్చెను. అతిఘోరయుద్ధ మొకటి ప్రారంభమాయెను. ఇందియనులు తెల్లవారిని బరాజితులజేసి పలుతెఱంగుల వేధింపజొచ్చిరి. బూను కుమారుడు గాయము లనేకములు తగిలి క్షతకలిత శరీరుడాయెను. అతనితండ్రి యాతని నెత్తికొని పలాయితు డగుటకు బ్రయత్నించెను. తదర్థ మతడు పుత్రుని వీపున మోసికొని ప్రక్కనుండుహ్రదంబున దుమికి యీదుకొని పోవ నారంభించెను. ఎదురుగట్టు చేరునంతన ఆబాలు డుసురులు దొరగెను. అచట నిలిచి తిరిగిచూడ నిందియనులు వెన్నంటి ప్రవాహజలంబుల దేలుకొని వచ్చుచుంట విశద మాయెను. తనప్రాణముల గాపాడికొనుటకై యతడు దిట్టతనము వహించి. దనపట్టిక ళేబరంబు నట్టె దిగవైచి పరువిడవలసివచ్చెను. అట్లు పఱువిడి సురక్షితముగ నతడు బ్రయంటు ష్టేషను జేరెను. ఈ మధ్యకాలమున నిందియనులు ముగ్గురు పడుచుల జెరబట్టి గొంఫోయిరి. అం దొక్కతె బూను కొమార్తె. ముగ్గురును బూన్సుబరో గ్రామమునకు జేరినవారు. వారు కెంటకీ నదియం దొక చిన్న యోడపై విహరింపుచుండి దూర తటంబు వెరిసి యొడ్డుతాకిరి. అప్పుడు సామీప్యకుంజపుంజంబుల నుండి తటాలున నిందియనులు వెలువడుట గాంచి యా యాడుబిడ్డలు మృత్యుసాన్నిధ్యంబున కీడ్వబడినతెఱంగున భయవిహ్వలమానసలై ఘనస్వనంబున మొఱ్ఱోయని కేకవైచి