పుట:Abraham Lincoln (Telugu).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును గొంత నివారించుచున్నది. అయినను దక్కిన ముప్పదియెనిమిది యెకరములైన గొని పైరుపెట్టుట ఈబీద లింకనున కెట్లుసాధ్య మాయె ననుసందియము గలుగక మానదు. నాంసీని జేపట్టి నదిమొదలు థామ సేదో యొక విధమున వృద్ధి వొందుచువచ్చె ననుట నిర్వివాదాంశము. అతని పూర్వాచారములును పూర్వ గుణవిశేషంబులును మెల్లమెల్లగ నాతని విడిచిపెట్టసాగెను.

థామసు లింకను కథలు సెప్పుటయం దతిసమర్థుడు. తమ పూర్వీకుల చరిత్రము నంతయు మిక్కిలి యుత్సాహముతో జెప్పుచుండును. ఇదివఱకు వ్రాయబడిన విషయముల కీతడు మఱియొక యంశమును వీరరసోత్పాదకంబును జేర్చి తన కుమారుని మనము రంజిలజేయుచుండెనట. థామసు ఆబ్రహామును గుఱించి "అబ్బీ! మీతాత నాకు జెప్పుచుండిన విషయము లన్నియు విశదీకరింప దొడగితినేని దినములు గాదు వారము లైనను జాలక పోవును. అత డీ దేశమునకు వచ్చిన 1780 వ సంవత్సరముననే ఎఱ్ఱ యిందియనులు గుంపులు గుంపులుగ జేరి తెల్లవారిపై దండెత్తివచ్చి ముట్టడించిరి. అపుడు మనవా రెల్లరును సైనికులు గావలసివచ్చెను. డేనియల్ బూ నకు మహవేటకాడు సేనానయకుల వాడుగ నియమింపబడెను. జనరల్ క్లార్కు సర్వసేనాధిపత్యము వహించి లోయరు బ్లూలిక్సు దగ్గర శత్రువుల సమరంబున నెది