పుట:Abraham Lincoln (Telugu).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుగుణసంపదకు బేరెక్కి యుండిరి. కావున వా రెల్లపుడును స్వమత ధర్మముల దప్పక పాటింప బ్రయత్నించుచుందురు. థామసుభార్య యాతనికన్న నెక్కుడు క్రైస్తవభక్తి గలదియు నెక్కుడు మనశ్శక్తియుతయు. "ఆమె సన్న నై యంత రక్తపుష్టిలేక చుఱుకుదనము గల్గి సాహ సౌదార్య స్వభావముచే నొప్పి తనవారల మొఱకుదనమునకు వగచుచుండె" నని దాక్టరు హాలండు చెప్పుచున్నాడు. "ఆమె కుటుంబమువారామెబుద్ధిచాతుర్యము లనన్యసామాన్యము లని తలంచుచుండి"రని లేమను వక్కాణించుచున్నాడు. నిశ్చయముగా నామె గుణగణ్య యై బుద్ధి కుశలత గలిగి యొప్పుచుండెను. ఆమెయందు థామసున కధిక గౌరవమును గౌరవముచే నాదర ణానురాగములును బలము నొందెను. అందువలన నాతడామె సుబోధలచే సంపూర్ణఫలము వడసెను.

నిరుపేద లగు నిట్టితలిదండ్రులవలన నిదివఱకు వర్ణింపబడిన మహామందిరమున 1809 వ సం||ము ఫిబ్రవరి 10 వ తేది ఆబ్రహాము లింకను భూమియందవతరించెను. నాలుగుసంవత్సరములకు దరువాత నతనితండ్రి నాబుచరియదరికి వెడలెను. అచట నతడు నూటముప్పది యెకరములభూమి గడించుట మిక్కిలి యాశ్చర్యకరమై తోచుచున్నది. రెండవసంవత్సరమే యందు నూరెకరము లమ్మివేయబడియె ననుట యీ యాశ్చర్య