పుట:Abraham Lincoln (Telugu).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాడు. నాలుగుక్షరము చేర్చి చదువుటకుగాని రెండక్కరములుకూర్చి వ్రాయుటకు గాని యత డెఱుగడు. అయిన నతనిభార్య ధారాళముగ జదువ గల్గుడు. వ్రాయుటయందంత సమర్థురాలు గాదు. తనపేరు వ్రాసికొనునంత మాత్రము పరిశ్రమ గలది. ఇట్లగుట వివాహానంతర మామె దనభర్తం గాంచి విద్యాభ్యసనమునకు గాలాతిక్రమణ మెప్పటికిని లేదు. మీ రిప్పటికైన బనిబూని యక్కార్య మొనర్పవచ్చుననియె. థామసరువదియెనిమిది సంవత్సరములవాడై సౌలభ్యమునందే దృష్టికలవా డగుట ముసలిముప్పుకు దొలిసమర్త యన్నట్లా వయసున నక్షరమాల బ్రారంభించుట దుర్ఘట మని జడసెను. అయిన నాంసి యతని సందియంబుల దీర్చి స్వహస్తమున పేరు లిఖింప గల్గినను గుర్తువేసి కాలము గడుపుటకన్న ననేక మడుంగులు లెస్స యగునని తెల్పి దా దనభర్త నంత వానిగ జేయ సమకట్టెను. తుట్టతుద కాసాత్వికుడు దనసతీతిలకము గురువుగా జేకొని మిక్కిలి శ్రద్ధ జేసి బుద్ధికుశలంత కవగాహన మగువిధమున సంతక మొనర్చునంతటి ప్రవీణుడై ఈ X గుర్తువేయ విద్యావిహీనుల తరగతి నుండి తప్పించుకొన గల్గెను.

థామసు నాంసి వీరిరువును క్రైస్తవ మతస్థులై యప్పటి బాప్టిస్టు తెగకు జేరినవారు. ఆకాలమున నీతెగవారే