పుట:Abraham Lincoln (Telugu).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుందురు. అయిన నెంతసాహసవంతు లయినను దారిద్ర్యమున మునిగి తేలువారే యిట్టిపనికి బ్రప్రథమమున సమకట్టు చుందురు. అమెరికాయందు నూరుసంవత్సరములకుము న్నుత్తర పస్చిమభాగములయందలి ఎఱ్ఱ యిందియనులు దెల్లవారనిన బద్ధవైరము బూనియుందురు. ఆభాగముల వసించు యూరోపియనులంద ఱన్నివేళల దుపాకి సాయము గొనక యిలువెడలుట లేకుండెను. అంతజాగ్రత్తతో బయిలుదేరినను వారు తమ ప్రాణముల బిడికిట బట్టుకొని ఎఱ్ఱ యిందియను లెప్పు డేమార్చి పైబడుదురో గదాయని జంకుచు నటునిటుజూచుచు మెలగు చుందురు. మహోత్పాతముల కాలవాలమగు నిట్టితరుణమున నాబ్రహాము లింకను తాత పూర్వ ప్రదేశమగు వర్జినియాయందుండి యచట జనబాహుళ్య మగుట గాంచి కెంటకీసీమ సారవంతమనివిని పశ్చిమభాగమైదు:ఖభాజ నంబగుట గూడ లెక్కగొనక యచటికి 1780 సంవత్సరమునం బ్రయాణమై పోయెను. అప్పటి లింకను దండ్రియగు థామసు రెండుసంవత్సరములవాడు. అతనిని మఱియిద్దఱు కుమారులను, ఇద్దఱు కూతులను వెంటబెట్టుకొని యాయాసములకు వెనుదీయక లింకను తాత కెంటకీ సీమజొచ్చి యొక నివాసస్థల మేర్పఱచుకొని నాలుగుసంవత్సరములు గడపెను. ఆ మీద నొకనాడతడు దనపెద్దకుమారుల బ్రక్కపొలములం