పుట:Abraham Lincoln (Telugu).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆబ్రహాము లింకను.

మొదటి ప్రకరణము

ఆబ్రహాము లింకను తల్లిదండ్రులు, జననము, శైశవము.

రమారమి యొకటిరెండు శతాబ్దములకుబూర్వ మమెరికాఖండ మిప్పటివలె ధనసంపత్తిచే నొప్పి, గొప్ప పట్టణము లనేకములచే నలంకరింపబడి లోకమందెల్లర కన్నుల మిఱుమిట్లు గొలుపుచుండుట లేదు. ఎచ్చట జూచిన నడవులు విస్తారమై ఎఱ్ఱ యిందియనులను మోటుజాతివారితో నిండి యితరులకు జొర భయము గల్పించుచుండు. అప్పుడప్పుడ తెల్లవారనేకు లితరఖండముల నాక్రమించుకొనిన తెఱంగుననే యీ ఖండము నాక్రమించుకొన బ్రయత్నించుచుండిరి. పాశ్చాత్యుల దమదమ దేశముల జీవనోపాయము లేనివారు మనదేశమునందు వలె నాకలముల దినియో బిచ్చ మెత్తుకొనియో పొట్టబోసికొనుటలేదు. ఇతర దేశములకు దఱలి మొదట మొదట కష్టములపాలయ్యు రానురాను స్వశక్తికిప్రయోగమున బ్రవృద్ధిగాంచి యిప్పటి యమెరికను వలె సుఖం