పుట:Abraham Lincoln (Telugu).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేయు నాసార్వభౌముండగు జారును ప్రపంచమున నిక నేరాష్ట్రాధిపతియు నమేరికా దేశాధ్యక్షుని శక్తి గారవంబుల గాన డనుట కెంతమాత్రము సందియంబంద బనిలేదు. ఇట్టి లోకోత్కృష్ట పదవి నందిన వారిలో ననేకు లతిహీన జన్ములు గలరు. స్వకాయకష్టంబునను, స్వబుద్ధి విశేషంబునను ఈరెంటికన్న మిన్నయగు స్వగుణశీలంబునను వీరు దేశోద్ధారణ కార్యధురంధరులై యాచంద్రతారకంబగు గీర్తిసామ్రాజ్యంబున సర్వాధికారంబు వహించి తాము పరిపాలించిన యా యునైటెడ్‌స్టేట్సునకు వన్నె వెట్టుచు క్షణభంగురం బగుస్థూలకాయంబు వదలి సూక్ష్మ స్వరూపంబున బ్రపంచము నెల్ల లేవదీయ జూచుచున్నారు. అబ్రహాములింకనం దగ్రగణ్యుడు. అతని చరిత్ర నిచ్చట సంగ్రహముగ వ్రాయ బూనితిమి. దాని జాగ్రతతో జదివి పరిశీలించినచో దేవుడెంత కరుణాళుడో మనుజునకు వృద్ధిబొంద నెంతశక్తి స్వాతంత్ర్యము లిచ్చియున్నాడో, మనదేశమునం దీశక్తి స్వాతంత్ర్యము లుపయోగించు కొనకనో, యుపయోగించు కొనుటకు వీలులేకనో కష్టతమములగు పురాతన సాంఘిక పద్ధతులకు లోబడియు బరదేశీయుల యవచ్ఛిన్న సార్వభౌమత్వపు జల్లని నీడనుండి సంతసింపవలసి వచ్చియు మన